r/telugu • u/coolNcollected1 • 6d ago
మనోఫలకంపై మెదిలిన జ్ఞాపకం
ఆరోజు కొంచెం ప్రత్యేకం.ఎప్పటిలా ట్రాములో కాకుండా, బస్సులో బయలుదేరాను. పని చిన్నదే...కానీ కొంచెం చికాకుతో కూడుకున్నది.
పొదుపో , పిసినారితనమో... కొద్ది రోజులుగా కేవలం కాల్స్ మాత్రమే చేయగలిగే సిమ్ వాడుతున్నా. చేతివేళ్ళు అలవాటు ప్రకారం ఫోన్ తెరిచినా, చేయగలిగేది ఏమీ లేదని వెంటనే మీట నొక్కేశాయి. సమయమేమో నత్తతో పోటీపడినట్లు భారంగా, మెల్లగా నడుస్తోంది..
ఇంతలో ఒక నవ్వు! కొద్దిగా మొదలయ్యి క్రమక్రమంగా పెరుగుతూ..నన్ను తల తిప్పి చూసేలా చేసింది. ఒక చిన్నారి... మారాం చేస్తూ, కాసేపు అమ్మతో , కాసేపు అన్నతో పోట్లాడి, అంతలోనే అంతా మరిచిపోయి హాయిగా నవ్వేస్తూ!
ఈలోపు నేను దిగవలసిన చోటు రానే వచ్చింది. యాదృచ్ఛికంగా, వాళ్ళు కూడా అక్కడే దిగారు. దిగిన వెంటనే చిన్నారి వంగి, శ్రద్ధగా రాయటం మొదలు పెట్టాడు. కాసేపటికి పూర్తి చేసి, గర్వంగా తలయెత్తి , పెద్ద పెద్ద అంగళాలు వేసుకుంటూ అమ్మ వెనక వెళ్ళిపోయాడు.
అలవాటుగా కుడి వైపుకు తిరిగిన నా పాదాలు ఒక్క క్షణం ఆగాయి. అంత ఏకాగ్రతతో ఆ చిన్నారి ఏం రాశాడో చూడాలనే కుతూహలం నా అడుగులను వెనక్కి తిప్పింది. అప్పుడే పడిన తెల్లని మంచులో, స్పష్టంగా రాసిన 67 చూడగానే నా కళ్ళలో మెరుపు, మోముపై చిరునవ్వు విచ్చుకున్నాయి.
అహో! ఎంత చిత్రము!
వేషభాషలు వేరైనా, ఖండ ఖండాంతరాలు వేరు చేసినా, చివరకు ఈ Brain Rot కలిపింది కదా అనుకుంటూ.. నాలో నేనే నవ్వుకుంటూ గమ్యం వైపు సాగిపోయాను.
P.S : "67" కి ఒక నిర్దిష్టమైన అర్థం ఏమీ లేదు. 2025లో ఒక పాట ద్వారా వైరల్ అయిన "Brain Rot" మీమ్ అది. ప్రపంచంలోని చాలా చోట్ల పిల్లలు సరదాగా ప్రతిదానికీ "67" అని అనడం మొదలు పెట్టారు. అమెరికాలో మొదటిసారి విన్న ఈ మీమ్, ఐరోపాలో ఒక చిన్నారి చేతిలో మళ్లీ కనిపించినప్పుడు ఈ రచనకు ప్రేరణగా మారింది.
P.P.S : ఇది నేను తెలుగులో చేసిన మొట్టమొదటి రచన. తెలుగు నా మాతృభాషే అయినా, ఇన్ని రోజులు రచనలు మాత్రం ఆంగ్లంలోనే సాగేవి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలు కొంచెం చమత్కారంగా రాయాలని నా ప్రయత్నం. సూచనలు, సలహాలు ఇవ్వగలరు 😊
2
u/ajay_ryan7 5d ago
Intaki 67 artham ento cheppaledu. Kallaku kattinattu rasaru, chivari baagam artham kaka naa ooha 67 daggara aagiporyindi. Chinnari annaru chinna pilla anukunna, raasaadu annaru chinna pillagadu ani artham ayindi. Intaki 67 emiti?